మహేష్- రాజమౌళి మూవీలో ఆ స్టార్ నటుడు
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా సినిమా క్యాస్టింగ్ గురించిన విషయాలు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. మహేష్ కెరీర్లో 29వ మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్ సహా పలు పరిశ్రమల నుంచి నటీనటులను సెలెక్ట్ చేస్తున్నాడు రాజమౌళి.
ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రను చేయనున్నాడని మొన్నీమధ్యే వార్తలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఇంతలో ఆదిపురుష్ లో నటించిన దేవదత్తా నాగే ఈ సినిమాలో మరో పాత్రకు ఎంపికయ్యాడని అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. దేవదత్తా నాగే రీసెంట్ గా రాజమౌళిని కలిసి ఆ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
అంతే. అప్పటినుంచి మహేష్- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో దేవదత్తా నాగే నటిస్తున్నాడంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మొత్తానికి దేవదత్తా షేర్ చేసిన ఒక్క ఫోటో వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. దేవదత్తా ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేస్తూ లెజెండరీ డైరెక్టర్ తో చెరిషబుల్ మూమెంట్ అని అన్నాడు కానీ ఎందుకు కలిసాడో మాత్రం వివరించలేదు. మరి దేవదత్తాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ వచ్చిందా లేదా అన్నది తెలియాలంటే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.