Radha Spaces ASBL

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి

సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు  ఆయన మాటల్లో కొంచెమైనా వాస్తవాలు లేవన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? అని ప్రశ్నించారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. మైక్‌ సమస్య వస్తే, కరెంట్‌ కోతలు అంటూ అబద్దాలు మాట్లాడారని తెలిపారు.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా నమోదైంది. సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరిగింది. ఏప్రిల్‌, మే నెలలోనూ సరిపడా విద్యుత్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాం. దేశమంతా గ్రిడ్‌ అనుసంధానం 2013లోనే యూపీఏ ప్రభుత్వం చేసింది. పదేళ్లలో పాలనలో కేసీఆర్‌ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలి. అందరికీ రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారా? ప్రతి మండలంంలో బాలబాలికలలకు ఇంగ్లిష్‌ మీడియాం స్కూళ్లు, ప్రతి నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా? దళితులకు మూడెకరాల  భూమి పంపిణీ చేశారా? రైతులకు రుణమాఫీ ఐదేళ్లలో పూర్తి చేశారా? వర్షాకాలంలో అధికారంలో ఉన్నది ఎవరు? వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసిందెవరు? ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం కుంగిపోయింది. అన్ని లెక్కలతో చర్చకు రావడానికి నేను సిద్ధం అని సవాల్‌ విసిరారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :