Radha Spaces ASBL

రివ్యూ : యూత్ ను ఆకట్టుకునే 'దీనమ్మ జీవితం'

రివ్యూ : యూత్ ను ఆకట్టుకునే 'దీనమ్మ జీవితం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : యశ్వంత్ రామస్వామి క్రియేషన్స్,  
సమర్పణ : దుర్గాశ్రీ ఫిలిమ్స్
నటీనటులు : దేవ్‌ బల్లాని, ప్రియ చౌహాన్‌, సరిత చౌహాన్, షన్ను షేక్, బన్నీ, లక్కీ, తదితరులు
సినిమాటోగ్రఫీ : సతీష్ కుమార్ కరే, సంగీతం : ఆర్ యస్,
పాటలు : సురేష్ గంగుల, ఎడిటర్ : జానీ భాషా షేక్,
దర్శకత్వం : యాళ్ల మురళి కృష్ణ
విడుదల తేదీ : 05.01.2024

దేవ్‌ బల్లాని , ప్రియ చౌహాన్‌, సరిత చౌహాన్ ప్రధాన పాత్రల్లో ‘ప్రేమ పిపాసి’ ఫేం మురళి రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దీనమ్మ జీవితం’. వై.మురళి కృష్ణ, వై.వెంకటలక్ష్మీ, డి.దివ్య సంతోషి, బి.సోనియా నిర్మించారు. రా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియాన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం!

కథ:

క్రిష్ అలియాస్ కృష్ణ (దేవ్ బల్లాని) సినిమాల్లో డైరెక్షన్ అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతనికి భార్య రాధ (ప్రియా చౌహాన్), ఓ కూతురు ఉంటుంది. అయితే మరో అమ్మయి మహి అలియాస్ మహిమ (సరిత చౌహాన్) తో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో తరచు గొడవ పడుతూ... కెరీర్లో సెటిల్ అవ్వకుండా ఆపసోపాలు పడుతూ ఉంటాడు. ఈ తన భర్త మరో అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వున్నాడని తెలుసుకుని రాధ ఎంతో బాధపడుతుంది. దారి తప్పిన తన భర్తను ఎలాగైనా దారికి తెచ్చుకొని తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటుంది. అదే సమయంలో క్రిష్ కూడా మహిని ఎలాగైనా వదిలించుకుని భార్యతో సంతోషంగా వుండాలనుకుంటాడు. మరి మహి క్రిష్ ని ఎలా వదిలించుకున్నాడు? అందుకోసం ఏమి చేశాడు? క్రిష్ కి మహి ఎలా పరిచయం అయింది. అలాగే రాధ... క్రిష్ కి ఎలా పరిచయం అయింది? వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

దేవ్ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా... కెరీర్ లో స్టిరపడాలనుకునే అప్ కమింగ్ డైరెక్టర్ గా బాగనే వేరియేషన్స్ చూపించారు.. అలాగే యాడ్ ఫిల్మ్ డైరక్టర్ గా వుండే కొందరు అబ్బాయిలు అమ్మాయిలకు ఎలా అట్రాక్ట్ అవుతారనే పాత్రను బాగా చేసాడు. మహి పాత్రలో సరిత చౌహాన్ బోల్డ్ రొమాన్స్ చేసి యూత్ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. గృహిణి పాత్రలో ప్రియా చౌహాన్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది. పరాయి అమ్మాయి మోజులో దారి తప్పిన భర్తను ఎలా దారికి తెచ్చుకునే ఓ సిన్సియర్ గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

గతంలో ప్రేమకోసం తపించే ఓ పిచ్చి ప్రేమికుని కథతో ప్రేమ పిపాసి తీసిన చిత్ర దర్శకుడు మురళి రామస్వామి... ఈసారి మనసుకు నచ్చిన ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే భర్త... తన ప్రియుడికోసం పరితపించే ఆమ్మాయి మహి పాత్రను నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా చూపించారు. కొన్ని బోల్డ్ సీన్స్ యానిమల్ సినిమాని తలపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు.. ఐటెం సాంగ్ యూత్ కి కనెక్ట్ అవుతుంది.. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

సినిమా ఇండస్ట్రీ... అందులో స్థిరపడాలనుకునే నటీ నటుల పైనా... సాంకేతిక నిపుణుల పైనా ఎలాంటి అభిప్రాయం ఉందో ఇప్పటికే చాలా సినిమాల్లో సెటైరికల్ గా చూశాం. అలాంటి సెటైరికల్స్ ఇందులో చాలానే ఉన్నా... అన్యోన్యంగా ఉండే ఇద్దరు భార్యా భర్తల మధ్య మరో ఆమ్మాయి ఎంటర్ అయితే ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది... దాని వల్ల కెరీర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది రా గా చూపించారు. భార్య ప్రెగ్నెన్సీతో వున్నప్పుడు... భర్త తన క్షణిక సుఖం కోసం మరో అమ్మాయి వెైపు ఆకర్షితుడై ఎలా ఇబ్బందులు పడ్డారనేది చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి... సెకండ్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ చూపించి పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఓవరాల్ గా సినిమా ఓ కె అనిపిస్తుంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :