ASBL NSL Infratech

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల ఆరా..!! ఎందుకో తెలుసా..??

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల ఆరా..!! ఎందుకో తెలుసా..??

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలన్నీ దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు అనే ఉత్కంఠ ఈసారి ఏపీలో నెలకొంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఆరా తీస్తున్నారు. ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ కంటెస్టంట్ల కోసం ఎందుకిలా ఆరా తీస్తున్నారు..?

గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 2014లో 2.28శాతం 2019లో 1.19శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ఒక్క చోట కూడా ఆ పార్టీ గెలవలేదు. పైగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అయితే ఈ సారి షర్మిల పీసీసీ చీఫ్ గా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుందనే అంచనాలున్నాయి. కొన్ని చోట్ల ఓట్లు చీల్చడంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనే భయం కూడా ప్రధాన పార్టీలకు పట్టుకుంది. కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరికి చేటు చేస్తాయోనని నేతలు కంగారు పడుతున్నారు. అందుకే కాంగ్రెస్ జాబితాకోసం ఆరా తీస్తున్నారు.

షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె. ఆయన చరిష్మా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. షర్మిల రూపంలో తమకు ఆయన ఇమేజ్ కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. జగన్ తో విడిపోయిన షర్మిల ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అది కూడా కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తోంది. ఆమె కడపలో పోటీ చేయడం వల్ల ఆ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా ప్రభావం చూపుతుంది. వైసీపీ ఓట్లే చీలి కాంగ్రెస్ పడతాయని టీడీపీ అంచనా వేస్తోంది. షర్మిల ఎన్ని ఓట్లు చీల్చుతుంది.. దాని వల్ల మనకు ఎంత నష్టం కలుగుతుందని వైసీపీ లెక్కలేసుకుంటోంది. కడప పార్లమెంటు స్థానంలో షర్మిల ఎవరికి ట్విస్ట్ ఇస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది.

మరోవైపు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతోంది. ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీట్లు ఇచ్చింది. కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఆర్థర్, ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎలీజాను బరిలోకి దింపుతోంది. సిట్టింగులు కాబట్టి వీళ్ల ప్రభావం కాస్తోకూస్తో కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి కీలకనేతలు అక్కడక్కడా బరిలోకి దిగుతున్నారు. వీళ్లు చీల్చే ఓట్లు తమ కొంప ఎక్కడు ముంచుతాయోననే భయం ప్రధాన పార్టీల అభ్యర్థులకు పట్టుకుంది. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ నేతలను తెరవెనుక ప్రోత్సహించడం ద్వారా ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లిస్టుకోసం అంత ఆతృతగా ఆరా తీస్తున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ నేతలు ఎవరికి ఝలక్ ఇస్తారో..!! 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :