కాగ్నిజెంట్ చేతికి బెల్ కాన్
అమెరికా కేంద్రంగా 60 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్‌వేర్, డిజిట్ ఇంజినీరింగ్ సేవల సంస్థ బెల్‌కాన్ ను, ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ 1.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10,800 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి నగదు, స్టాక్ రూపేణ ఈ లావాదేవీ జరగనుంది. ఈ కొనుగోలుతో ఏరో స్పేస్, రక్షణ, అంతరిక్ష, ఆటోమోటివ్ రంగాల్లో కాగ్నిజెంట్ విస్తరించనుంది. బెల్‌కాన్‌కు 60కి పైగా దేశాల్లో 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. బోయింగ్, జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, నాసా, అమెరికా నేవీ వంటి సంస్థలకు బెల్‌కాన్ సేవలు అందిస్తోంది. ఒప్పందం ప్రకారం బెల్‌కాన్ ప్రస్తుత సీఈవో లాన్స్ క్వానీవ్‌స్కీని కొనసాగించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Tags :