ASBL Koncept Ambience
facebook whatsapp X

'ట్రంప్' కార్డ్ - బై'డన్'.. అట్లాంటా వేదికగా హాట్ డిబేట్..

'ట్రంప్' కార్డ్ - బై'డన్'.. అట్లాంటా వేదికగా హాట్ డిబేట్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి ట్రంప్, బైడన్ ముఖాముఖి...

ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నిక.అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు..? ఏ అభ్యర్థి ఎన్నికైతే మనతో సంబంధాలు ఎలా ఉంటాయో అన్న ఆతృత ప్రపంచదేశాల్లో వ్యక్తమవుతోంది.ఎందుకంటే ఎన్నికయ్యేది అగ్రరాజ్యాధిపతి మరి. ఈ పోటీకోసం ఇద్దరు అపరచాణక్యులు తలపడుతున్నారు. ఇద్దరూ తలపండినవాళ్లు, అపార రాజకీయ అనుభవం కలిగిన వారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇద్దరూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లు. దీంతో ఎవరు గెలుస్తారో, ఎవరి విదేశాంగ విధానం ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో పరిణామాల్ని ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.

అట్లాంటా వేదికగా ట్రంప్, బైడన్ డిబేట్..

నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్‌ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్‌ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు.

ఈ డిబేట్ లో ఇద్దరు అభ్యర్థులు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికల్లో 81 బైడెన్‌, 78 ఏళ్ల ట్రంప్‌ వయసు కూడా ప్రధానాంశంగా ఉంది. ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్దినెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. అలాగే పలు సందర్భాల్లో గందరగోళం కనిపించింది. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా..? అని అంతా ఎదురుచూస్తున్నారు.

మరోపక్క అబార్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడి అతివాద వైఖరిని బైడెన్‌ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ట్రంప్ వలస విధానంలో మార్పులు, ఆయనపై ఉన్న కేసులు సహా కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. మరీ ముఖ్యంగా ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత చర్చతో ఈ ఇద్దరి అభ్యర్థులపై ప్రజలు ఓ స్పష్టతకు వచ్చే అవకాశముంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :