ASBL NSL Infratech

శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం: కేసీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్ మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటుందంటూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ కథ ముగిసిందని, రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్, బీజేపీలకు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను పదేళ్ల పాటు బీజేపీ దగా చేసిందని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తమ ప్రభుత్వం పడిపోబోతోందని కేసీఆర్ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. ‘మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం’ అని చెప్పారు.

కూతురి కోసం ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తెలంగాణను కేసీఆర్ తాకట్టు పెట్టారని, అలాంటి కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి, రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు.. రెండూ లేవని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించిన రేవంత్.. ‘‘రాష్ట్రానికి, దేశానికి మోదీ తీరని అన్యాయం చేశారు. అందుకే కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా. వచ్చే జూన్ 9వ తేదీన ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేయబోతున్నారు’’ అంటూ జోస్యం చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :