ASBL NSL Infratech

అన్నింటికీ సీబీఐ కావాలనే వాళ్లిద్దరూ.. ఫోన్ ట్యాపింగ్‍పై : సీఎం రేవంత్

అన్నింటికీ సీబీఐ కావాలనే వాళ్లిద్దరూ.. ఫోన్ ట్యాపింగ్‍పై : సీఎం రేవంత్

అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే బీఆర్‍ఎస్‍ నేతలు కేటీఆర్‍, హరీశ్‍రావు ఫోన్‍ ట్యాపింగ్‍పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‍ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో రేవంత్‍ మీడియాతో మాట్లాడుతూ అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్యాయి. ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ట్యాపింగ్‍ అంశం బయటకు వచ్చింది. హార్డ్డిస్క్లు, డేటా బ్యాకప్‍ ఎక్కుడుందో అధికారులే తేల్చాలి. డేటా ఉందో, లేదో ఎలా మాయం చేశారో అంతా విచారణలో తేలుతుంది. మా ప్రభుత్వం ఫోన్‍ ట్యాపింగ్‍ చేయదు. రాష్ట్రంలో రాచరిక వ్యవస్థకు తావులేదు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు. అవి గుర్తుకు వచ్చేలా రాష్ట్రం చిహ్నం ఉంటుంది. రాష్ట్ర గీతం రూపకల్పన బాద్యతలు అందెశ్రీకి అప్పగించాం అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలపై నిపుణుల సలహాతో ముందుకెళ్తాం. ప్రస్తుతం అక్కడ నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. వాటి విద్యుత్‍ బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్‍ వినియోగం పెరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో కరెంట్‍ కోతలు లేవు. ఎన్నికల కోడ్‍ ముగిసిన తర్వాత విద్యుత్‍కు సంబంధించిన అన్ని విషయాలు వివరిస్తా అని రేవంత్‍ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :