ASBL NSL Infratech

తెలంగాణలో మహాలక్ష్మి, గృహ జ్యోతి ప్రారంభం

తెలంగాణలో మహాలక్ష్మి, గృహ జ్యోతి ప్రారంభం

ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. పేదల ప్రజలకు మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు తెలిపారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి రూ.1,500కే దేశంలోని పేదలందరికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చింది. రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రంలోని బీజేపీ రూ.1,200కి పెంచింది. పేదలకు గ్యాస్‌ సిలిండర్‌ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నాం. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతుంది అని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :