ASBL NSL Infratech

తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రూ100 కోట్లతో క్లోవర్టెక్స్

తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రూ100 కోట్లతో క్లోవర్టెక్స్

అమెరికాకు చెందిన క్లోవర్టెక్స్‌ సంస్థ తెలంగాణలో రూ.100 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. లైఫ్‌ఖ సైన్సెస్‌ విభాగంలో సైంటిఫిక్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పనిచేస్తున్న క్లోవర్టెక్స్‌ అంతర్జాతీయ, పాన్‌-ఇండియా వినియోగదారులకు సేవలందించేందుకు హైదరాబాద్‌లోని తమ గ్లోబల్‌ కేపబిలిటీస్‌ సెంటర్‌(జీపీసీ)ను విస్తరించాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో బోస్టన్‌ నగరంలో సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి క్షితిజ్‌ కుమార్‌ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌ బృందం  సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా క్లోవర్టెక్స్‌ హైదరాబాద్‌లోని జీపీసీని విస్తరించేందుకు రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నందుకు సంతోషిస్తున్నా. దీనివల్ల 100`150 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయని అని తెలిపారు.

2019లో స్థాపించిన క్లోవర్టెక్స్‌ సంస్థ నూతన ఔషధాల పరిశోధనలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఔషదం మార్కెట్‌లోకి రావడానికి సాధారణంగా పదేళ్లు పడుతోంది. ఔషద ఆవిష్కరణ సమయాన్ని తగ్గించడం, రోగుల  ప్రాణాలను రక్షించడంలో సహాయపడటం క్లోవర్టెక్స్‌ ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం అందించిన సహాయాన్ని మేము నిజంగా అభినందిస్తున్నాం. స్థానిక, అంతర్జాతీయ కంపెనీలకు కూడా ప్రపంచస్థాయి సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది అని క్లోవర్టెక్స్‌ వ్యవస్థాపకుడు క్షితిజ్‌కుమార్‌ తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి ఎం.నాగప్పన్‌, సమ్మిట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు అండ్‌ సీఈఓ సందీప్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :