ASBL NSL Infratech

చియాన్ విక్రమ్ "ధృవ నక్షత్రం" సినిమా ట్రైలర్ రిలీజ్

చియాన్ విక్రమ్ "ధృవ నక్షత్రం" సినిమా ట్రైలర్ రిలీజ్

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "ధృవ నక్షత్రం". రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం" ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.

"ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...ముంబై పై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్ జీ టీమ్ లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు. చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్ మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు. క్రికెట్ టీమ్ లా 11 మంది ఉండే బేస్ మెంట్ కోవర్ట్ టీమ్ లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్ గా వస్తాడు జాన్. ఈ కోవర్ట్ టీమ్ తరుపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. జాన్ క్యారెక్టర్ లో చియాన్ విక్రమ్ కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీ రోల్ లో నటించారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :