మెగా156 లేనట్టేనా?

భోళా శంకర్ తర్వాత చిరూ కొత్తగా చేయనున్న సినిమాల్లో ప్రస్తుతం చర్చల్లో ఉన్న సినిమా మాత్రం వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా గురించే. ఈ సినిమా చిరూ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కనుంది. అయితే మెగా156గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. కానీ భోళా శంకర్ రిలీజ్ తర్వాత స్టోరీ మొత్తం మారిపోయింది.
మెగా156 రీమేక్ కాదంటూనే బ్రో డాడీ స్టోరీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చే ప్రయత్నం చేశారు కళ్యాణ్ కృష్ణ టీమ్. కథ ఎంత ఛేంజ్ చేసినా దాన్ని కూడా రీమేక్ అనే అంటారు కాబట్టి, మెగా ఫ్యాన్స్ సైతం ఈ రీమేక్స్ విషయంలో చిరాకుగా ఉన్నారని అర్థం చేసుకున్న చిరూ ఆ సినిమాను పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది.
అందుకే ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమా ఇంకా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ఉంది. ఈ సినిమా చిరూ చేసినా ఇప్పుడు చేయడని, వశిష్ఠతో సినిమా అయ్యాకే ఈ సినిమా గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది. వశిష్ఠ మూవీని చిరూ అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకసారి సినిమాను మొదలుపెడితే ఇక బ్రేక్ ఇవ్వకుండా పూర్తి చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారట. చిరూ అంతగా వశిష్ఠ స్క్రిప్ట్ ను నమ్మి చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.






