ASBL NSL Infratech

తేజపై మెగాస్టార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

తేజపై మెగాస్టార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడు ఎవ‌రికి ఎలాంటి బ్రేక్ వ‌స్తుందో చెప్ప‌డం క‌ష్టం. ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూసినా కొంత‌మందికి హిట్ ద‌క్క‌దు. మ‌రికొంద‌ర‌కి మొద‌టి సినిమాతోనే బ్రేక్ దొరుకుతుంది. న‌వీన్ పోలిశెట్టి, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దాని కార‌ణం వాళ్ల కెరీర్లో వారు అందుకున్న స‌వాళ్లే.

ఇప్పుడు ఈ కోవ‌లోకి తేజ స‌జ్జ కూడా చేర‌బోతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే హ‌ను మాన్ లాంటి ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మెగాస్టార్ చిరంజీవే అన్నారు. రీసెంట్ గా ఆహా- పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ క‌లిసి సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.

ఆ కార్య‌క్ర‌మంలో చిరంజీవి తేజ స‌జ్జ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడు. త‌న‌కెప్ప‌టినుంచో ఇష్ట దైవ‌మైన హ‌నుమంతుడి మీద సినిమా చేయాల‌ని ఉంద‌ని, ఎంత ట్రై చేసినా అది కుద‌ర‌లేద‌ని, బాల న‌టుడిగా త‌న ఇన్‌స్పిరేష‌న్ తో వ‌చ్చిన తేజ దాన్ని చేయ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని, హ‌ను మాన్ చూశాక ఆ విజ‌యం త‌నే సాధించినంత ఆనందంగా ఉంద‌ని తేజ స‌జ్జ చూస్తుండ‌గానే స్జేజి మీద చెప్ప‌డంతో ఒక్క‌సారిగా చ‌ప్పట్లు మారు మోగిపోయాయి. ఒక‌ప్పుడు చిరూతో బాల న‌టుడిగా క‌లిసి న‌టించిన తేజ ఇప్పుడు ఏకంగా ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ నే చేయ‌డం అనూహ్య‌మే అయినా చిరూ, తేజ‌ను అభినందించ‌డం గొప్ప విష‌యం.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :