ASBL NSL Infratech

చంద్రబాబు ఇంతలా మారిపోయారేంటి..?

చంద్రబాబు ఇంతలా మారిపోయారేంటి..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ సరళి చూసిన తర్వాత ఆ రెండు పార్టీలూ తామే గెలుస్తామని ధీమాగా ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటున్నాయి. జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఎక్కువ పోలింగ్ నమోదు కావడం కూడా తమకు కలిసొస్తుందని కూటమి భావిస్తోంది. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నేతలంతా పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. విదేశాలకు వెళ్లి సేద తీరుతున్నారు.

సాధారణంగా ప్రతి చిన్న విషయానికి స్వయంగా మీడియా ముందుకొచ్చి హడావుడి చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తానే ముందుకొచ్చి వివరించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు తీరు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. మే 13న ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే చంద్రబాబు మీడియా ముందుకు రాలేదు. ఏమీ మాట్లాడలేదు. సహజంగా పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు అదే రోజు సాయంత్రం మీడియా ముందుకొచ్చి తామే గెలుస్తున్నామని ధీమాగా చెప్పేవారు.

చంద్రబాబు ఈసారి మాత్రం ఎవరికీ కనిపించలేదు. అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లి ఆ తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. సహజంగా విదేశాలకు వెళ్లినా అక్కడ ఏం చేస్తున్నారో.. ఎవరెవరిని కలుస్తున్నారో మీడియాకు ఫోటోలు రిలీజ్ చేసేవారు. కానీ ఈ దఫా మాత్రం చంద్రబాబు ఎక్కడికెళ్లారో.. ఎవర్ని కలిసారో.. అసలు ఎప్పుడెళ్లారో కూడా చాలా మందికి తెలీదు. ఆయన పర్యటనను అంత గుంభనంగా ఉంచారు. బుధవారం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవగానే అభిమానులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలికారు.

కీలకమైన ఎన్నికల సమయంలో అన్నీ తానై వ్యవహరించే చంద్రబాబు ఈసారి మౌనంగా ఉండడంపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారు. దాని వెనుక కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నారు. గెలుపుపై ధీమాతోనే కామ్ గా ఉంటున్నారని కొందరు అంటుంటే.. ఓడిపోతామనే భయంతోనే నోరు విప్పలేకపోతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. ఏదేమైనా చంద్రబాబు ఇలా మౌనంగా ఉండడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :