ASBL NSL Infratech

బాబుకు తలనొప్పిగా మారిన ఫ్యామిలీ సీట్స్..

బాబుకు తలనొప్పిగా మారిన ఫ్యామిలీ సీట్స్..

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో పార్టీ సీనియర్ తమ్ముళ్లు కు చంద్రబాబు పెద్ద షాక్ ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని నమ్ముకొని సూపర్ సీనియర్లుగా ఉన్న కుటుంబాల కు ఒక్కొక్క టికెట్ చొప్పున ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పాడు. అయితే పార్టీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు కనీసం రెండు టికెట్లు అన్నా రావాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా టిడిపిలో సీట్ల కొరత ఏర్పడింది. దీనికి తోడు సీనియర్లు కుటుంబానికి రెండు చొప్పున సీట్లు కోసం పట్టుబడడం చంద్రబాబుకు మరింత తలనొప్పిగా మారుతుంది.

ఉన్న టెన్షన్స్ చాలా అన్నట్లు త్వరలో మిగిలిన ఆ ఖాతాలోకి బిజెపి లేక కాంగ్రెస్ వాటాకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన సీట్లు మొత్తం పొత్తులకే పోతే.. అసలు కాండిడేట్ల పరిస్థితి ఏమిటా అని తెలుగు తమ్ముళ్లు తెగ సతమతమవుతున్నారు. పోనీ ఉన్న టికెట్లు సీనియర్ నేత కుటుంబాలకు కేటాయిస్తే మిగిలిన వాళ్ళలో అసంతృప్తి తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాబు ఆ ఛాన్స్ తీసుకోలేడు. అందుకే ఏదేమైతే అది అయ్యింది అని ఫిక్స్ అయిపోయిన బాబు సీనియర్లకు కేవలం ఒక టికెట్ అని కన్ఫామ్ గా చెప్పేసాడు. చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కోసం నర్సీపట్నం అసెంబ్లీ టికెట్టు.. అతని కొడుకు చింతకాయల విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు. మరోపక్క పరిటాల సునీత రాప్తాడులో పోటీకి దిగడానికి సిద్ధపడుతూ కొడుకు శ్రీరాం కు ధర్మవరం టికెట్ కావాలని పట్టుబడుతుంది.

పూసపాటి అశోక గజపతిరాజు తనతో పాటు తన కూతురు అదితీకి కూడా టికెట్ కేటాయించాలని అడుగుతున్నాడు. ఇలా పార్టీ సీనియర్ నేతలు తమతో పాటు తమ పిల్లలకు లేక జీవిత భాగస్వాములకు టికెట్లు అడిగేస్తున్నారు. ఉన్న నాలుగు టికెట్లు కుటుంబానికి రెండు చొప్పున పంచుకుంటూ పోతే మిగిలిన నేతలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇది అర్థం చేసుకున్న బాబు ముందు జాగ్రత్తగా శనివారం జరిగిన సమావేశంలో ఖచ్చితంగా కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే అని తేల్చి చెప్పేశారు. మరి ఈ విషయం ఇదే రీతిగా ఉంటుందా లేక కొత్తగా ఇందులో ఏమన్నా ట్విస్టులు వస్తాయా చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :