ASBL NSL Infratech

క‌ల్కి ఈవెంట్‌కు గెస్టులు వాళ్లేనా?

క‌ల్కి ఈవెంట్‌కు గెస్టులు వాళ్లేనా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా క‌ల్కి 2898 ఏడి. ఈ సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ఆడియ‌న్స్ కు అంచ‌నాల‌ను పెంచేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయ‌డానికి మేకర్స్ నార్త్ లో కూడా భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

ముంబై లో ఇప్ప‌టికే ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న మేక‌ర్స్, తెలుగులో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ ప్రీరిలీజ్ ను ఏపీ లో నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ ఈవెంట్ కు ఏపీ కొత్త సీఎం చంద్ర‌బాబు నాయుడును, జ‌నసేన అధ్య‌క్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీ ఎల‌క్ష‌న్స్ లో కూట‌మిగా ఏర్ప‌డి బాబు, ప‌వ‌న్ సాధించిన విజ‌యం అంతా ఇంతా కాదు. క‌ల్కి నిర్మాత అశ్వ‌నీద‌త్ కూడా వారికి మోర‌ల్ స‌పోర్ట్ గా ఉన్నారు. మిగిలిన వాటిలో ఎలా ఉన్న ఏపీలో గ‌త ఐదేళ్లు సినిమా ప‌రిశ్ర‌మ‌కు కాస్త ఇబ్బందిక‌రమైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. కానీ ఇప్పుడు మారిన ప్ర‌భుత్వం అలా కాకుండా సినీ ఇండ‌స్ట్రీకి అండ‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. క‌ల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ విష‌యాన్ని డిక్లేర్ చేసేలా చంద్ర‌బాబు తో పాటూ ప‌వ‌న్ ను కూడా ఈ ఈవెంట్ కు ఆహ్వానిస్తార‌ని తెలుస్తోంది. దీంతో ప‌వ‌న్, ప్ర‌భాస్ ఇద్ద‌రూ ఒకే వేదిక మీద క‌నిపిస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :