ASBL NSL Infratech

11న టీడీఎల్పీ.. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం

11న టీడీఎల్పీ.. 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఈ నెల 11న టీడీఎల్పీ నేతగా చంద్రబాబుని ఎన్నుకుని గవర్నర్‌కు నివేదిక పంపుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 12న ఉంటుందని వెల్లడించారు. ప్రమాణ స్వీకారానికి మోదీ సహా వివిధ పార్టీల నేతల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. మోదీ, ఒడిశా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు చంద్రబాబు వెళ్తారని తెలిపారు. ఓటమి చూశాక కూడా జగన్‌ తీరు మారలేదని విమర్శించారు. అసహనంతో తెలుగుదేశం శ్రేణులపై దాడుల్ని ప్రేరేపిస్తూ, తామేదో దాడులు చేస్తున్నట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :