ASBL NSL Infratech

ప్రజాక్షేత్రంలో జగన్ ను దోషిగా నిలబెట్టాలి : చంద్రబాబు

ప్రజాక్షేత్రంలో జగన్ ను దోషిగా నిలబెట్టాలి : చంద్రబాబు

రాజకీయ స్వార్థం కోసం సీఎం జగన్‌ పింఛనర్ల పొట్టకొట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే రూ.4వేల పింఛన్‌ ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్‌ అందకపోతే, అది కూడా కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారం నుంచి దిగిపోతూ కూడా జగన్‌ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు పింఛన్‌ ఇప్పించే వరకు టీడీపీ నేతలు రాజీ పడొద్దు.  కలెక్టర్లను కలిసి పింఛన్‌ ఇళ్ల వద్దే అందేలా చూడాలి. ప్రజా క్షేత్రంలో జనగ్‌ను దోషిగా నిలబెట్టాలి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాన తర్వాత జగన్‌ రూ.13 వేల కోట్లు గుత్తేదారులకు దోచిపెట్టారు. 15 రోజుల్లో ఎవరెవరికి ఎంత బిల్లు ఇచ్చారో ప్రకటించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. తటస్థంగా పనిచేసే  వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :