ASBL NSL Infratech

సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్‌ 1 వరకు యూరప్‌ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :