ఫ్లాపు లకు ఆది ఇప్పుడైనా ఫుల్స్టాప్ పెడతాడా?
![ఫ్లాపు లకు ఆది ఇప్పుడైనా ఫుల్స్టాప్ పెడతాడా?](https://www.telugutimes.net/storage/news/news_new_71954.jpg)
ఆది సాయి కుమార్ కు నటవారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది తన మొదటి సినిమా ప్రేమ కావాలితోనే మంచి హిట్ అందుకున్నాడు. ఉన్నంతలో ఆ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాత ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా కూడా హిట్ అయింది. దీంతో ఆది హీరోగా సెట్ అయిపోతాడనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఆది నుంచి వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడలేదు.
హిట్టూ ఫ్లాపూ పక్కన పెడితే ఆదికి అవకాశాలైతే వస్తూనే ఉన్నాయి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఆది సినిమాలు చేసుకుంటూనే వస్తున్నాడు. ఇప్పటికి ఆది చేసిన సినిమాలు దాదాపు 20 అయ్యాయి. వాటిలో కొన్ని రిలీజైన విషయం కూడా ఆడియన్స్ కు తెలీదు. కొన్ని సినిమాలైతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి.
ఇలాంటి టైమ్ లో ఆది కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే సినిమాను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు డైరెక్టర్ వీరభద్రం చౌదరి. అహ నా పెళ్లంట, పూల రంగడు లాంటి సూపర్ హిట్స్ అందించిన ఈ డైరెక్టర్ తర్వాత భాయ్ అనే సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఆదితోనే వారాలబ్బాయ్ అనే సినిమా చేశాడు కానీ అది కూడా ఫ్లాపే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలకు సంగీతం అందించిన అనూప్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ఆది తన డిజాస్టర్లకు ఫుల్స్టాప్ పెడతాడో చూడాలి.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)