కులం హిందూమత మౌలిక స్వభావం కాదు.. కాలిఫోర్నియా పౌరహక్కుల శాఖ
కులం, కులపరమైన దుర్విచక్షణ హిందూ మత మౌలిక స్వభావం కాదని కాలిఫోర్నియా రాష్ట్ర పౌర హక్కుల శాఖ తీర్మానించినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ తెలిపింది. సిలికాన్ వ్యాలీలోని సిస్కో సిస్టమ్స్ సంస్థలో కుల వివక్ష చోటుచేసుకున్నట్లు ఒక ఉద్యోగి చేసిన ఫిర్యాదు ఆధారంగా 2020 అక్టోబరులో పౌరహక్కుల శాఖ కేసు నమోదు చేసింది. అందులో కుల వివక్ష హిందూ మత మౌలిక లక్షణమని పేర్కొంది. హిందూ మతానికి కులపరమైన దుర్విచక్షణను అంటగట్టడం అక్రమమని హిందూ ఫౌండేషన్ ఫిర్యాదు చేయగా, పౌర హక్కుల శాఖ గత డిసెంబరులో సదరు వాక్యాలను అభియోగ పత్రం నుంచి తొలగించింది. అమెరికాలో చాలా పెద్ద స్థాయిలో కుల వివక్ష ఉందంటూ ఈక్వాలిటీ ల్యాబ్స్ చేసిన సర్వేను పౌర హక్కుల శాఖ పరిగణనలోకి తీసుకోవడం సమస్యాత్మకమని ఫౌండేషన్ వ్యాఖ్యానించింది.
Tags :