ASBL NSL Infratech

కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం

కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం

అమెరికాలోని కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదస్పదమైన తీర్మానం చేసింది. 1984లో భారత్‌లో చోటు చేసుకొన్న సిక్కు వ్యతిరేక అల్లర్లను నరమేధంగా గుర్తించాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరింది. ఈ హింసను ఖండిరచాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు.  ఆ అల్లర్ల కారణంగా ఏర్పడిన మానసిక, శారీరక గాయాల నుంచి సిక్కు వర్గాలు ఇప్పటికీ కోలుకోలేదని సదరు తీర్మానంలో పేర్కొన్నారు. అందుకే 1984లో అల్లర్లను అమెరికా కాంగ్రెస్‌ నరమేధంగా గుర్తించి ఖండించాలని కోరుతూ అసెంబ్లీ సభ్యురాలు జస్మీత్‌ కౌర్‌ బయాన్స్‌ మార్చి 22న తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికైన తొలి సిక్కు జస్మీత్‌ కౌర్‌ కావడం గమనార్హం. సభలో ఉన్న హిందూ సభ్యుడు యాష్‌ కార్లా కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఢిల్లీలో 1984లో అల్లర్ల బాధిత ప్రాంతమైన ఓ కాలనీని కూడా ఈ తీర్మానంలో ప్రస్తావించారు. 2015 లో కూడా ఈ అసెంబ్లీ సిక్కు వ్యతిరేక అల్లర్లను ఓ హత్యాకాండగా అభివర్ణిస్తూ తీర్మానం చేసిందని అమెరికన్‌ గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ అధ్యక్షుడు ప్రీత్‌పాల్‌సింగ్‌ వెల్లడిరచాడు. గతేడాది జనవరి 6న న్యూజెర్సీ సెనెట్‌ కూడా ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :