లాస్ ఏంజెలెస్ లో బస్సు హైజాక్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వ్యాపార కూడలి వద్ద ఓ బస్సు హైజాక్‌కు గురైంది. తన వద్ద తుపాకీ ఉందంటూ ఓ దుండగుడు ఓ బస్సును తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆ బస్సు పలు వాహనాలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వాహనదారు గాయపడ్డారు. అనంతరం ఆ బస్సు ఓ హోటల్ గోడను బలవంగా ఢీ కొట్టింది. ఈ మేరకు స్థానిక పోలీసులు వెల్లడించారు. లాస్ ఏంజెలెస్ కౌంటీ మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీకి చెందిన బస్సులోకి దుండగుడు ప్రవేశించిన సమయానికి బస్సు డ్రైవర్ మాత్రమే ఉన్నాడని వివరించారు. సంఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ కోసం జైలుకు తరలించారు.
Tags :