Radha Spaces ASBL

రేపు ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. కేసీఆర్ స్పీడ్ పెంచుతున్నారా..?

రేపు ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. కేసీఆర్ స్పీడ్ పెంచుతున్నారా..?

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల కేసీఆర్ లో కనిపిస్తోంది. అందుకోసమే ఆయన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనుకుంటున్నారు. అయితే సమయాభావం వల్ల నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ముందు దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలపై దృష్టి పెట్టనున్నారు. అయితే ఆ లోపు వీలైన రాష్ట్రాల్లో నెమ్మదిగా అడుగులు వేయాలనుకుంటున్నారు.

బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవలే కేసీఆర్ ప్రారంభించారు. మహారాష్ట్రపైన ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అక్కడ పార్టీ పట్ల నేతలు కొంతమంది ఉత్సాహంగా చూపిస్తున్నారు. దీంతో అక్కడ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం చూపించినా చివరి నిమిషంలో ఎందుకో వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రేపు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు.

తెలంగాణ తర్వాత మొదట ఏపీలోనే బీఆర్ఎస్ ను విస్తరిస్తారని చాలా మంది భావించారు. కేసీఆర్ ను స్వాగతిస్తూ బ్యానర్లు వెలియడం, ఏపీతో పోల్చితే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ ఉండడం ఆయన పట్ల సానుకూల సంకేతాలను పంపింది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనెత్తి ఏపీలో చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్. అదే దూకుడును మున్ముందు కూడా కంటిన్యూ చేస్తుందని అందరూ భావించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు వార్తల నేపథ్యంలో ఫోకస్ డైవర్ట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఏపీపై కేసీఆర్ దృష్టి పెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ పీఆర్పీ, జనసేన నేత తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. రావెల కిశోర్ బాబు సహా పలువురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆ తర్వాత పెద్దగా కదలిక లేదు. అయితే ఇప్పుడు మంగళగిరి సమీపంలో హైవేపై ఐదంతస్తుల కార్యాలయాన్ని ప్రారంభించబోతోంది బీఆర్ఎస్. సర్వహంగులతో కార్యాలయాన్ని సిద్ధం చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. అయితే బీఆర్ఎస్ పట్ల ఏపీలో పెద్దగా సానుకూలత కనిపించట్లేదు. మరి ఆ పార్టీ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :