Radha Spaces ASBL

100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్య: మాజీ సీఎం కేసీఆర్

100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్య: మాజీ సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఈ 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు దుర్భర  పరిస్థితులు అనుభవించడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ పరిస్థితి చూసి బాధతో బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నానాన్న కేసీఆర్.. కాంగ్రెస్ అడుగు పెట్టడంతోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారని, మరి ఆ వాగ్దానం ఇంకా ఎందుకు నెరవేరలేదని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని, బ్యాంకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

"మా ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నీళ్లు అందించాం. కానీ ఇప్పుడు మళ్లీ ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి. ట్యాంకర్లు రావాల్సిన దుస్థితి వచ్చింది. కరెంట్ అంతరాయాలతో మోటార్లు కాలిపోతున్నాయి. కాళేశ్వరం జాలాలు వృథాగా వదిలిపెట్టారన్నారు. సీపేజ్ వాటర్ పోయినా డ్రామా చేశారు. కానీ మొన్నటిదాకా 7వేల క్యూసెక్కులు వృథాగా పోయాయి. భారతదేశంలో తెలంగాణ పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించిందని గతంలో ఐఎల్ఓ ప్రకటించింది. కానీ ఇప్పుడు రైతులకు నీళ్ళే లేవు. మేము పర్యటనకు వస్తున్నామని తెలియడంతో హుటాహుటిన ఎస్ఆర్ఎస్‌పీ నీళ్లు వదిలారు. నిజానికి ఇది వచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ అసమర్థత తెచ్చిన కరువు" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎండగట్టారు.

కాగా.. ప్రెస్ మీట్ జరుగుతుండగానే కరెంట్ పోవడంతో పరిస్థితి ఇలా ఉందంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం 1.8% ఓట్లతోనే గెలిచిందని.. అయితే తాము ఓడినా వదిలిపెట్టేది లేదని.. తరిమి కొడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చిన కేసీఆర్.. రణరంగమైనా సరే రైతులకు  బీఆర్ఎస్  అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :