బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ... ఎలా అమలు చేస్తారు
రైతులకు తగిన నిధులు కేటాయించకుండా పంటల బీమా, మద్దతు ధర, రైతు భరోసా ఎలా అమలు చేస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని విమర్శించారు. అసెంబ్లీలోనూ అబద్ధాలే చెబుతోందని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.82వేల కోట్లు కావాలి. బడ్జెట్‌లో రూ.16 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. పంటల బోనస్‌కు రూ.15వేల కోట్లు, రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం. కానీ, వాటికి రూపాయి కూడా కేటాయించలేదు. ఇళ్ల నిర్మాణాఇకి రూ.23వేల కోట్లు అవసరమవుతాయి. ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,700 కోట్లు పెట్టారు. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. మొదటి అసెంబ్లీ సమావేశంలో ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయినా చట్టం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అని అన్నారు.