దాన్ని ముట్టుకుంటే ఈ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది : హరీశ్‌రావు
రేవంత్ రెడ్డిపై గతంలో కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. హన్మకొండలో నిర్వహించిన బీఆర్‌ఎస్ లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. విమర్శలు చేసిన రేవంత్ రెడ్డితోనే కండువా కప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇంత దిగజారడం అవసరమా అని కడియం శ్రీహరి ఆలోచించాలి. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువని కడియం శ్రీహరే అన్నారు. ఇప్పుడు అందులోకే వెళ్లారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి, అధైర్యపడాల్సిన అవసరం లేదు. వరంగల్ జిల్లా ఉద్యమాల ప్రాంతం. ఇక్కడి కార్యకర్తలు భయపడరు. ఈ జిల్లాకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు మెడికల్ కళాశాలు ఇచ్చింది. కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. దాన్ని ముట్టుకుంటే ఈ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది. ఉద్దెర మాటలు తప్ప కాంగ్రెస్ ఉద్ధరించేది లేదు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏం చేశారు? అని ప్రశ్నించారు.