ASBL NSL Infratech

ఆసియా కుబేరుల జాబితాలో బ్రిటన్ ప్రధాని, ఆయన భార్య

ఆసియా కుబేరుల జాబితాలో బ్రిటన్  ప్రధాని, ఆయన భార్య

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన  ఏషియన్‌ రిచ్‌ లిప్ట్‌ 2022లో చోటు చేసుకున్నారు. 790 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.7,700 కోట్ల) సంపదతో సునాక్‌, అక్షత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది  జాబితాలోని వారి మొత్తం సంపద 113.2 బిలియన్‌ పౌండ్లుగా నమోదైంది. 2021తో పోలిస్తే ఇది 13.5 బి పౌండ్లు అధికం. వరుసగా ఎనిమిదో ఏడాది హిందుజా కుటుంబ 30.5 బిలియన్‌ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 2021తో పోలిస్తే 3 బిలియన్‌ పౌండ్లను అదనంగా హిందూజా కుటుంబం జత చేసుకుంది.  24వ వార్షిక ఏషియాన్‌ బిజినెస్‌  అవార్డ్స్‌ కార్యక్రమంలో హిందుజా గ్రూప్‌ సహ చైర్మన్‌, గోపీచంద్‌ హిందుజా కుమార్తె రితు  చాబ్రియాకు లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ ఈ ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌ 2022 ప్రతిని అందజేశారు.  బ్రిటన్‌లో ఆసియా సంతతి ఏటా వృద్ధి చెందుతోందనడానికి ఈ జాబితా నిదర్శనమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.  .

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :