ASBL NSL Infratech

విల‌న్ ను వెతుకుతున్న బోయ‌పాటి

విల‌న్ ను వెతుకుతున్న బోయ‌పాటి

టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కాంబోగా బాల‌కృష్ణ‌- బోయ‌పాటికి పేరుంది. వీరి కాంబోలో వ‌చ్చిన సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొకటి హిట్ట‌య్యాయి. సింహా, లెజెండ్, అఖండ క్రియేట్ చేసిన రికార్డులు గురించి బాల‌య్య ఫ్యాన్స్ ఎప్పుడూ గ‌ర్వంగా చెప్పుకుంటారు. అలాంటి కాంబినేష‌న్ లో ఇప్పుడు మ‌రో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 109వ సినిమా చేస్తున్న బాల‌య్య‌, ఎల‌క్ష‌న్స్ కోసం బ్రేక్ తీసుకున్నాడు. రిజ‌ల్ట్స్ రాగానే మ‌ళ్లీ ఈ సినిమా షూటింగ్ లో బాల‌య్య పాల్గొన‌నున్నాడు. ఇది కాకుండా బాల‌య్య త‌ర్వాత చేయ‌బోయే సినిమా బోయ‌పాటితోనేని, అది కూడా అఖండ‌2 నే అని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మన్న‌ది తెలియ‌దు కానీ బోయ‌పాటి మాత్రం విల‌న్ కోసం తెగ వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే బాల‌య్యకు విల‌న్ గా ఇద్ద‌రు బాలీవుడ్ న‌టులు ప‌ని చేవారు. ఇప్పుడు దీన్నే కొన‌సాగించాల‌ని డిసైడ‌య్యాడ‌ట బోయ‌పాటి. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ ద‌త్ ను ఫ‌స్ట్ ఆప్ష‌న్ గా అనుకుంటున్నార‌ట‌. కానీ సంజూ భాయ్ వ‌రుస సినిమాల‌తో చాలా బిజీగా ఉన్నాడు. అత‌ని డేట్స్ దొర‌క‌డం చాలా క‌ష్టం. ఒక‌వేళ సంజ‌య్ ద‌త్ కుద‌ర‌క‌పోతే విల‌న్ గా ఎవ‌రిని తీసుకోవాల‌ని కూడా బోయ‌పాటి ఆలోచిస్తున్నాడ‌ట‌. స్కంద తో డిజాస్ట‌ర్ అందుకున్న బోయ‌పాటికి ఈ సినిమా హిట్ ఎంతో కీల‌కం కానుంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :