ASBL NSL Infratech

కిషన్ రెడ్డి టార్గెట్ అదేనా..?

కిషన్ రెడ్డి టార్గెట్ అదేనా..?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచింది. గత ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఈసారి రాష్ట్రంలో అత్యధికంగా ఎంపీసీట్లు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా విజయసంకల్ప యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.నారాయణపేట జిల్లా కృష్ణాలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శంఖారావం పూరించారు.

రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి యాత్రలను కొనసాగించనుంది బీజేపీ. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్‌ షోలు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 2న ఇవి ముగియనున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్‌ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీనేతలు తెలిపారు.

ఇక్కడి నుంచి సూట్‌కేసులు ఢిల్లీకి మోస్తూ.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దమవుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మరోసారి సూట్‌కేసుల రాజ్యాన్ని కాంగ్రెస్ తీసుకొస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ రెండూ దొంగపార్టీలేనని, కుటుంబపార్టీలేనని ఆరోపించారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని మోడీ.. మూడోసారి కచ్చితంగా విజయభేరీ మోగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

మరోవైపు ఇదే సమయంలో ... బీజేపీ, బీఆర్ఎస్ బంధంపై జరుగుతున్న ప్రచారం కమలనాథులను ఆందోళనకు గురిచేస్తోంది. కేసీఆర్‌పై వ్యతిరేకత ఎక్కడ సార్వత్రిక ఎన్నికల్లో తమ కొంప ముంచుతుందో అన్న భయమే వారిని వెన్నాడుతోంది. దీంతో .. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తులేదని బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ కాళ్ల బేరానికి వచ్చినా, తాము ఆపార్టీతో పొత్తు పెట్టుకోమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :