Radha Spaces ASBL

రాజాసింగ్ సస్పెన్షన్‌పై బీజేపీ మౌనం.. కారణం అదేనా..?

రాజాసింగ్ సస్పెన్షన్‌పై బీజేపీ మౌనం.. కారణం అదేనా..?

బీజేపీ నేత రాజాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లారు. అదే విషయంలో అతడిని సస్పెన్డ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా రాజాసింగ్ బెయిల్‌పై బయటకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. కానీ అతడి సస్పెన్షన్‌పై మాత్రం బీజేపీ మౌనం పాటిస్తోంది. కనీసం సస్పెన్షన్ ఎత్తివేసే ఊసు కూడా వినిపించడం లేదు. ప్రస్తుతం దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజాసింగ్‌కు పార్టీలోని కొందరు నాయకులకు విభేదాలు ఉన్నాయని, అవే ఇప్పుడు అతడిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించేందుకు అడ్డుగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే  వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రాజాసింగ్ పార్టీకి పూర్తిస్థాయి వివరణ ఇచ్చినా సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకులేదని తెలుస్తోంది. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్రి శశిధర్ కలిసిన సమయంలో షా కూడా రాజాసింగ్ మాటలను తప్పుబట్టారని, రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా ఉన్న పార్టీ హైకమాండ్ ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదని అర్థమవుతోంది. రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో రాజాసింగ్‌కు మద్దతిచ్చే వారు ఉన్నప్పటికీ బయటకు రాలేకపోతున్నారన్న చర్చా లేకపోలేదు. తన సస్పెన్షన్‌పై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుంటే తన భవిష్యత్ కార్యచరణపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ నుంచి రాజాసింగ్ తప్పుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలా, లేదంటే సొంత వేదికను ఏర్పాటు చేసుకోవాలా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం రాజాసింగ్ ఏం చేస్తారన్న విషయం తెలంగాణలో ఆసక్తికరంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :