బిల్ గేట్స్ సంచలన ప్రకటన... ఐదేళ్లలో ప్రతి ఒక్కరికీ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సంచలన ప్రకటన చేశారు. త్వరలో ప్రతి ఒక్కరికి కృత్రిమ మేథ వ్యక్తిగత సహాయకుడు అందుబాటులోకి వస్తాడని చెప్పారు. ప్రతి ఒక్కరి కోసం త్వరలో రోబోట్ ఏజెంట్ పనిచేస్తుంది. సమీప భవిష్యత్తులో, ఆన్‌లైన్‌లో ఉన్న ఎవరైనా నేటి సాంకేతికతకు మించిన కృతిమ మేధస్సుతో పనిచేసే వ్యక్తిగత సహాయ కుడిని కలిగి ఉంటారు అని బిలియనీర్ చెప్పారు. ఈ యుగంలో సాఫ్ట్‌వేర్ ఇంకా చాలా స్తబ్దుగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే రానున్న ఐదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని అంచనా వేశారు. కృత్రిమ పీఏలు తెలివైనవారు. చురుకుగా ఉంటారు. మీరు అడిగిఅడగక ముందే సలహాలు, సూచనలు అందిస్తారు అని బిల్‌గేట్స్ తెలిపారు. మీ అభిరుచులు, సాహస ప్రవృత్తి ఆధారంగా చేయవలసిన పనులను ఇది సిఫార్సు చేస్తుంది. మీకిష్టమైన రెస్టారెంట్‌లలో ఆర్డర్‌లను బుక్ చేస్తుంది. వ్యాపారం గురించి ఆలోచన మీకుంటే, వ్యాపార ప్రణాళికను వ్రాయడానికి, దాని కోసం ప్రదర్శనను రూపొందించడానికి, మీ ఉత్పత్తికి సంబంధించిన చిత్రాలను రూపొందించడానికి ఏఐ పీఏ మీకు సహాయం అందిస్తాడు అని తెలిపారు.






