ASBL NSL Infratech

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బ‌న్నీ.. మామూలు స్ట్రాట‌జీ కాదుగా

బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బ‌న్నీ.. మామూలు స్ట్రాట‌జీ కాదుగా

ఈ మ‌ధ్య సినీ ప‌రిశ్ర‌మ‌లో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. బాహుబ‌లితో మొద‌లైన సంద‌డి, త‌ర్వాత కెజిఎఫ్, పుష్ప సినిమాల‌తో పాటూ మ‌రిన్ని సినిమాలు సీక్వెన్స్ ల‌ను అనౌన్స్ చేశాయి. అయితే మొద‌టి భాగానికి మించి రెండో భాగంపై హైప్ క్రియేట్ చేయ‌డంలో పుష్ప‌2 స‌క్సెస్ అయింది. పుష్ప‌1 రిలీజైన‌ప్పుడు ఆ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నార్మ‌ల్ టాక్ వ‌చ్చింది.

త‌ర్వాత మెల్లిగా పిక‌ప్ అయిన పుష్ప‌1, నార్త్ లో మాత్రం రికార్డులు సృష్టించింది. యూట్యూబ్ కోసం డిజిట‌ల్ రైట్స్ కొన్న వారికి ఆ సినిమా కాసుల వ‌ర్షం కురిపించింది. ఆ త‌ర్వాతి నుంచి పుష్ప‌కు సంబంధించిన ఏ వార్త‌లొచ్చినా అవి హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు వెళ్లి పుష్ప‌1 ప్రీమియ‌ర్ లో పాల్గొన్న విష‌యం తెలిసిందే.

బ‌న్నీ ఈ ప్రీమియ‌ర్ కు హాజ‌ర‌వ‌డం వెనుక చాలా పెద్ద స్ట్రాట‌జీనే ఉంద‌ని తెలుస్తోంది.యూర‌ప్ త‌దిత‌ర దేశాల్లో పుష్ప‌2 డిస్ట్రిబ్యూష‌న కోసం బెర్లిన్ చిత్రోత్స‌వాన్ని పుష్ప టీమ్ వాడుకున్న‌ట్లు స‌మాచారం. అందుకే సినిమాను చూపించి మ‌రీ న‌మ్మ‌కాన్ని క‌లిగించార‌ని తెలుస్తోంది. రాబోయే రాజుల్లో ఇలాంటి స్ట్రాట‌జీల‌ను మ‌రిన్ని రెడీ చేయ‌బోతుంది పుష్ప టీమ్. ఓవ‌ర్సీస్ లో కూడా ప‌లు చోట్ల సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఎంత ఖ‌ర్చైనా స‌రే మైత్రీ మూవీ మేక‌ర్స్ రెడీ అనడంతో బ‌న్నీ కూడా పుష్ప‌2 ప్ర‌మోష‌న్స్ కోసం భారీగా త‌న టైమ్ ను ఖ‌ర్చు చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది.  కాగా పుష్ప‌2 ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :