ASBL NSL Infratech

మ‌రో హీరోయిన్ రాత మార్చేసిన హ‌రీష్ శంక‌ర్

మ‌రో హీరోయిన్ రాత మార్చేసిన హ‌రీష్ శంక‌ర్

కొందరు దర్శకుల చేతిలో పడితే హీరోయిన్ల రాత మారిపోతుందని ఒక నమ్మకం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఒకప్పుడు రాఘవేంద్రరావుకు ఇలాంటి పేరే ఉండేది. శ్రీదేవి సహా ఎందరో స్టార్ హీరోయిన్ల రాత మార్చారాయన. హీరోయిన్లను అందంగా, ఆకర్షణీయంగా చూపించి వాళ్ల కెరీర్‌కు ఊపు తెస్తారని ఆయనకు పేరుండేది. కొత్త తరంలో ఇలాంటి పేరున్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు.

కొంద‌రి డైరెక్ట‌ర్ల చేతిలో ప‌డితే హీరోయిన్లకు బ్రేక్ రావ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ ఉంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఇలాంటి పేరుంటే, ప్రస్తుత త‌రం డైరెక్ట‌ర్ల‌లో హ‌రీష్ శంక‌ర్ కు కూడా ఈ పేరుంది. గబ్బ‌ర్ సింగ్ సినిమాకు ముందు ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న శృతి హాసన్ కెరీర్ ఆ సినిమా త‌ర్వాత ఎక్క‌డికో వెళ్లిపోయింది.

త‌ర్వాత దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాతో పూజా హెగ్డే క్రేజ్ ను అమాంతం పెంచేశాడు హ‌రీష్ శంకర్. డీజీ మూవీ అంద‌రూ అనుకున్న‌ట్లు ఆడ‌క‌పోయినా ఆ సినిమా త‌ర్వాత పూజా మాత్రం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు హరీష్ సినిమాలో ఆఫ‌ర్ కొట్టేసిన మ‌రో భామ కెరీర్ ద‌శ కూడా మారిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో మిస్టర్ బ‌చ్చ‌న్ చేస్తున్న హ‌రీష్, ఆ సినిమాతో ముంబై భామ భాగ్య శ్రీ బోర్సేను ప‌రిచ‌యం చేస్తున్నాడు. మోడ‌ల్ క‌మ్ హీరోయిన్ అయిన భాగ్య‌శ్రీకి ప్ర‌స్తుతం చేస్తున్న సినిమా రిలీజ‌వ‌క‌ముందే క్రేజీ ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌- గౌత‌మ్ తిన్ననూరి కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా ఎంపికైన‌ట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు నాని- సుజిత్ కాంబోలో రానున్న సినిమా కోసం కూడా భాగ్య శ్రీని ఫైన‌ల్ చేశారంటున్నారు. చూస్తుంటే భాగ్య‌శ్రీ త్వ‌ర‌లోనే  టాలీవుడ్ లో బిజీ అయిపోయేలా క‌నిపిస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :