ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

250 మంది ఆటగాళ్ళతో ఉత్సాహంగా సాగిన బాటా, తానా క్రీడాపోటీలు

250 మంది ఆటగాళ్ళతో ఉత్సాహంగా సాగిన బాటా, తానా క్రీడాపోటీలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాలీబాల్‌, త్రోబాల్‌ పోటీలు కాలిఫోర్నియాలో ఉత్సాహభరితంగా జరిగాయి. అక్టోబర్‌ 22న జరిగే బాటా 50వ గోల్డెన్‌ జూబిలీ వేడుకలకు కర్టెన్‌ రైజర్‌గా జరిగిన ఈ పోటీలను నిర్వహించారు. వీటిలో అడ్వాన్స్‌, ఇంటర్మీడియట్‌, రిక్రీయేషన్‌ విభాగాల్లో పోటీలు జరిగాయి. పురుషులు వాలీబాల్‌ ఆడగా, మహిళలు త్రోబాల్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం 50 టీమ్స్‌ హోరాహోరాగీ తలపడిన ఈ పోటీల్లో క్రీడాకారులకు మద్దతు తెలిపేందుకు భారీగా ప్రేక్షకులు విచ్చేశారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించాయి.

ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొని, తమకు మద్దతుగా నిలిచిన క్రీడాకారులందరికీ బాటా అడ్వైజర్‌, టోర్నమెంట్‌ నిర్వాహకులు ప్రసాద్‌ మంగిన, ఉత్తర కాలిఫోర్నియా తానా ఆర్‌ఆర్‌ రామ్‌ తోట, తానా సెక్రటరీ సతీష్‌ వేమూరి, బాటా ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చికోటి, బాటా అడ్వైజర్‌ వీరు వుప్పల తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరినాథ్‌ చీకోటి.. ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మరికొన్ని రోజుల్లో జరిగే బాటా 50వ గోల్డెన్‌ జూబిలీ వేడుకలకు కూడా అందరూ విచ్చేయాలని ఆహ్వానించారు.

బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు - వైస్‌ ప్రెసిడెంట్‌ కొండల్‌ రావు, అరుణ్‌ రెడ్డి, శివ కాడ, వరుణ్‌ ముక్క
స్టీరింగ్‌ కమిటీ సభ్యులు - రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి
‘కల్చరల్‌ కమిటీ’ సభ్యులు - శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి  
‘యూత్‌ కమిటీ’ సభ్యులు - సంకేత్‌, ఆది, సందీప్‌, గౌతమ్‌, ఉదయ్‌, హరీష్‌, క్రాంతి
‘లాజిస్టిక్స్‌ టీమ్‌’ - హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ బాబు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

బాటా ‘అడ్వైజరీ బోర్డు’ సభ్యులు - జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ, కల్యాణ్‌ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తానా, బాటా టీమ్స్‌ అద్భుతమైన కృషి చేశాయని తానా ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు కొనియాడారు. 

టోర్నీలో విజేతలుగా నిలిచిన జట్ల వివరాలు

త్రోబాల్‌:


గోల్డ్‌ కప్‌:
విజేత-డామినేటర్స్‌, రన్నరప్‌-డైనమోస్‌
సిల్వర్‌ కప్‌: విజేత-స్మాషర్స్‌, రన్నరప్‌-సూపర్‌నోవాస్‌

వాలీబాల్‌: బిగినర్‌ విభాగంలో..

గోల్డ్‌ కప్‌: విజేత-స్పైకర్జ్‌, రన్నరప్‌-లాస్‌ పెర్రోస్‌ డెల్‌ మార్‌
సిల్వర్‌ కప్‌: విజేత-ఫ్రెమోంట్‌ ఏసర్స్‌, రన్నరప్‌-తగ్గేదేలే

ఇంటర్మీడియట్‌ విభాగంలో..
విజేత-మజా బాయ్స్‌
రన్నరప్‌- ఎఫ్‌వీసీ

అడ్వాన్స్‌ విభాగంలో..
విజేత-టీఎంసీ
రన్నరప్‌-లెజెండ్స్‌


Click here for Event Gallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :