Radha Spaces ASBL

బాటాకు 50 ఏళ్ళు...గోల్డెన్‌ జూబ్లి కిక్‌ ఆఫ్‌ కార్యక్రమం సక్సెస్‌

బాటాకు 50 ఏళ్ళు...గోల్డెన్‌ జూబ్లి కిక్‌ ఆఫ్‌ కార్యక్రమం సక్సెస్‌

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఏర్పాటై 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డెన్‌ జూబ్లి కిక్‌ ఆఫ్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఆగస్టు 5వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని తెలుగువాళ్ళు కుటుంబంతో సహా హాజరయ్యారు. తొలుత విజయ ఆసూరి (బాటా సలహాదారు) అతిథులందరినీ స్వాగతిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా బాటాతో తనకున్న అనుబంధాన్ని ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ఇంతకుముందు బాటాకు నాయకులుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం ఉన్న బాటా నాయకులు అసోసియేషన్‌ను కమ్యూనిటీకి దగ్గరగా తీసుకెళ్ళడంతోపాటు, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు.

హరినాథ్‌ చికోటి (బాటా ప్రెసిడెంట్‌) మాట్లాడుతూ బాటా 50వ ఉత్సవాల ప్రణాళికలు మరియు కార్యక్రమ ముఖ్యాంశాలను వివరించారు. బే ఏరియాలోని తెలుగువారందరికీ ఈ కార్యక్రమం ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా నిలవడానికి అందరూ సహకరించాలని కోరారు.

డా. హనిమి రెడ్డి, జయరామ్‌ కోమటి, సతీష్‌ వేమూరి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు పైగా బే ఏరియా కుటుంబాలకు తెలుగు సంస్కృతి, కళ, భాష సేవలతోపాటు, వినోదాన్ని అందించడంలో బాటా చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి ఒక్కరూ విరాళాలు అందించి 50వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని  కోరారు. నిధుల సమీకరణను ప్రారంభించడానికి వీలుగా వారు తమ వంతుగా భారీ విరాళాలను కూడా ప్రకటించారు.

బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ : కొండల్‌ రావు (వైస్‌ ప్రెసిడెంట్‌), అరుణ్‌ రెడ్డి (సెక్రటరీ), వరుణ్‌ ముక్కా (కోశాధికారి) శివ కదా (జాయింట్‌ సెక్రటరీ).

స్టీరింగ్‌ కమిటీ సభ్యులు - రవి తిరువీదుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి.

సాంస్కృతిక దర్శకులు - శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి మరియు తారక దీప్తి.

నామినేటెడ్‌ కమిటీ సభ్యులు - హరి సన్నిధి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు, సంకేత్‌

యూత్‌ కమిటీ - ఆదిత్య, సందీప్‌, హరీష్‌, ఉదయ్‌, గౌతమి, క్రాంతి.

బాటా సలహా సంఘం సభ్యులు - జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండాస కళ్యాణ్‌ కట్టమూరి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా సక్సెస్‌ చేసినందుకు బృందానికి అభినందనలు తెలిపారు.

వెంకట్‌ మద్దిపాటి (ఎస్‌ఇఇ), కిరణ్‌ ప్రభ మరియు గోవింద్‌ పసుమర్తి (బాటా మాజీ అధ్యక్షుడు)బాటాతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

కార్యక్రమంలో సంఘం నాయకులు వేణు ఆసూరి, రామ్‌ తోట, రజనీకాంత్‌ కాకర్ల, వెంకట్‌ కోగంటి, శ్రీనివాస్‌ వీరపనేని, వినయ్‌ పరుచూరి, యుగంధర్‌ రెడ్డి, హరి గక్కని, కిరణ్‌ విన్నకోట, లియోన్‌ రెడ్డి, జెట్టి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

బాటా కరవోకె టీమ్‌ సభ్యులు రవి గుడిపాటి, మానస సూపర్‌ హిట్‌ టాలీవుడ్‌ పాటలతో అలరించారు. 

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :