ASBL NSL Infratech

ఏప్రిల్ 2న బండి సంజయ్ రైతు దీక్ష

ఏప్రిల్ 2న బండి సంజయ్ రైతు దీక్ష

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే రైతుల కోసం జంగ్ సైరన్ మోగిస్తున్నట్లు, ఏప్రిల్ 2 మంగళవారం నుంచి రైతు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రౌతు దీక్ష చేస్తున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, రూ.500 బోనస్ హామీలను నెరవేర్చాలని దీక్షలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నష్ట పరిహారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, పంటల బీమా పథకాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదని, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీనీ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే ప్రభుత్వం పరిష్కరించేలా ఒత్తిడి చేయడానికే ఈ ‘రైతు దీక్ష’ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రైతు దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని, పార్టీలకతీతంగా ప్రభుత్వంపై పోరాటానికి చేతులు కలపాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 1, సోమవారం నాడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు సమస్యల పరిష్కారం కోసం బండి సంజయ్ వినతి పత్రాలు అందజేయనున్నారు. అలాగే వడ్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టనున్నారు. అనంతరం కల్లాల వద్దే రైతులతో కలిసి రాత్రి బస చేయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :