ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి..బండారు దత్తాత్రేయ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఎంతో ముఖ్యమైనది.. సంఘంలో మార్పు తీసుకువచ్చే శక్తి కేవలం ఓటు కు ఉంది అని కేంద్ర మాజీ మంత్రి..హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈరోజు ఆయన హైదరాబాదులోని రామ్ నగర్ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాదుకు వచ్చి ఓటు వేయడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుంది అని ఆయన అన్నారు. హైదరాబాదులో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు ప్రజలు బాగా స్పందించాలని.. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ నేపథ్యంలో బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు..
Tags :