ASBL NSL Infratech

స‌క్సెస్ జోష్ లో స్పీడు పెంచిన బాల‌య్య‌

స‌క్సెస్ జోష్ లో స్పీడు పెంచిన బాల‌య్య‌

మామూలుగా ఎంత‌టి స్టార్ హీరో అయినా స‌రే వ‌య‌సు పెరిగాక రిస్క్ చేయ‌డం త‌గ్గిస్తారు. కానీ టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు మాత్రం కుర్ర‌హీరోల‌కు పోటీ ప‌డి మ‌రీ రిస్క్ చేస్తున్నారు. వారిలో నంద‌మూరి బాల‌కృష్ణ నెక్ట్స్ లెవెల్. ఇదిలా ఉంటే ఈసారి బాల‌య్య బ‌ర్త్ డే ను ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో స్పెష‌ల్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.
 
బాల‌య్య మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డం, ఆయ‌న ఇద్ద‌రు అల్లుళ్లు మంచి మెజారిటీతో గెల‌వడం వ‌ల్ల బాల‌య్య కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇవాళ బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో త‌ను చేస్తున్న 109వ సినిమా యొక్క గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. సితార బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నట్లు స‌మాచారం.

ఇక ఇది కాకుండా బాల‌య్య 110వ సినిమాను కూడా ఈ సంద‌ర్భంగా అనౌన్స్ చేశారు. ఎప్ప‌టినుంచో అనుకుంటున్న‌ట్లే ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న నాలుగో సినిమా ఇది. 14 రీల్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా త‌న రెండో కూతురు తేజ‌స్విని స‌మ‌ర్ప‌కురాలిగా ప‌రిచ‌యం కానుంది. మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ నెక్ట్స్ సీజ‌న్ కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇలా ఓ వైపు రాజ‌కీయ నాయ‌కుడిగా, మ‌రోవైపు హీరోగా, ఇంకోవైపు హోస్ట్ గా బాల‌య్య రానున్న రోజుల్లో బాగా బిజీ కానున్నాడు. బాల‌య్య స్పీడు చూసి యంగ్ హీరోలు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :