ASBL NSL Infratech

క‌న్న‌ప్ప‌లో బాల‌య్య‌?

క‌న్న‌ప్ప‌లో బాల‌య్య‌?

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా క‌న్న‌ప్ప‌. ఈ సినిమాలో ఎంతో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది. క‌న్న‌ప్ప‌లో ప్ర‌భాస్, శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్ ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మ్ అయిన లిస్ట్ లో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలకృష్ణ చేరొచ్చ‌ని అంటున్నారు. క‌న్న‌ప్ప‌లో ఓ కీల‌క పాత్ర కోసం బాల‌య్య అయితే బావుంటుంద‌ని టీమ్ భావిస్తుంద‌ట‌.

దీంతో విష్ణుతో పాటూ మోహ‌న్ బాబు కూడా వ్య‌క్తిగ‌తంగా బాల‌య్య‌ను రిక్వెస్ట్ చేసే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. అయితే స్టోరీ విన్నాకే డెసిష‌న్ తీసుకోమ‌ని ఒక‌వేళ నో చెప్పినా తామేమీ ఫీల్ అవ‌మ‌ని ముందుగానే చెప్తార‌ట‌. అయితే బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు గెస్ట్ రోల్స్ చేసింది చాలా త‌క్కువ. ఒక‌ప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ కోసం స్పెష‌ల్ రోల్స్ చేశాడు బాల‌య్య‌.

చాలా ఏళ్ల త‌ర్వాత మంచు మ‌నోజ్ ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారాలో న‌టించాడు. స్టోరీ బాగా న‌చ్చ‌డంతో ఆ సినిమా అయినా చేశారు. సినిమా డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఆడియ‌న్స్ దాన్ని థియేట‌ర్లలో చూశారంటే బాల‌య్య కోస‌మే. ఆ సినిమా హార‌ర్ ట‌చ్ ఉన్న కామెడీ థ్రిల్ల‌ర్. క‌న్న‌ప్ప అలా కాదు. పూర్తి ఆధ్యాత్మిక‌త‌తో వీర శివ భ‌క్తుడి గాథ‌ను స‌రికొత్త టెక్నాలజీతో చెప్ప‌బోతున్నారు. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం రావ‌ణ‌బ్ర‌హ్మ కోసం బాల‌య్య ను క‌న్న‌ప్ప టీమ్ సంప్ర‌దించ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి బాల‌య్య ఈ సినిమా చేస్తాడా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా ఈ శివ‌రాత్రికి క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :