ASBL NSL Infratech

డల్లాస్‌ ఘర్షణ కథేమిటి? ప్రచారంలో ఉన్నదాంట్లో వాస్తవం ఎంత?

డల్లాస్‌ ఘర్షణ కథేమిటి? ప్రచారంలో ఉన్నదాంట్లో వాస్తవం ఎంత?

డల్లాస్‌లో 31వ తేదీ రాత్రి జరిగిన న్యూ ఇయర్‌ పార్టీలో పవన్‌ కళ్యాణ్‌, బాలయ్య అభిమానుల మధ్య ఘర్షణ, టీడిపి, జనసేన వర్గాల మధ్య డిష్యూమ్‌ డిష్యూమ్‌, టిడిపి మద్దతుదారుడు కేసి చేకూరి అరెస్ట్‌ అంటూ రెండు మూడు ఛానల్‌లలో వచ్చిన వార్తల వెనుక ఉన్న అస్సలు వాస్తవం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. ఆయా పార్టీలకు చెందిన ఛానల్స్‌ ఈ వార్తను తమకు నచ్చేలా వేయడంతో నిజం ఏమిటో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో సంఘటన స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల మేరకు విషయం మరో విధంగా ఉంది. 

మొదటి వర్షన్‌ ప్రకారం టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ మ్యూజికల్‌ నైట్‌ లో అర్థరాత్రి దాటాక మద్యం మత్తులో జై బాలయ్య అంటూ పవన్‌ అభిమానుల మీదకు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ ముఖ్యుడు కేసీ చేకూరి దూసుకెళ్ళడం, నిర్వాహకులు అమెరికా పోలీసులను పిలిపించడం వారు కేసీ చేకూరిని అరెస్ట్‌ చేసి కరోల్‌టన్‌ స్టేషన్‌కు తరలించడం వంటివి నిన్న ప్రచారమైన వార్త. నేడు ఆ సంఘటన వాస్తవాలను కే.సి. చేకూరి మిత్రులు తెలియజేశారు.  

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం గొడవ జనసైనికులకూ టీడీపీకి మధ్య కాదు...

పవన్‌ పాటలు ప్లే అవుతున్నప్పుడు కొంతమంది కుర్రకారు బాలయ్య పాటలు ప్లే చేయాలని రచ్చ చేయడం మొదలెట్టారు. సుమారు పదకొండు నలభై ప్రాంతాల్లో రావాలి జగన్‌ కావాలి జగన్‌ పాట రెచ్చగొట్టడం కోసం ప్లే చేసారు. పిల్లలు గొడవలకు దిగారు. అందరూ వైకాపా వాళ్ళూ జనసేన వాళ్ళు మధ్యలో తక్కువ సంఖ్యలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కోసం కేసీ ముందుకెళ్ళాడు. పోలీసులు వచ్చినప్పుడు ఓపీటీ మీద స్టూడెంట్‌ వీసా మీద ఉన్న కుర్రవాళ్ళ భవిష్యత్తు వీసా సమస్యల గురించి ఆలోచించి తాను ముందుకెళ్ళి బుక్కయ్యాడని అంటున్నారు.

కాగా ఈ పార్టీని నిర్వహించింది ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికార వైస్సార్సీపీ పార్టీ సపోర్ట్‌ చేసిన కార్యకర్తలని వారు కావాలనే రెచ్చగొట్టి కే.సి చేకూరిని అరెస్టయ్యేలా చేశారని అంటున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పార్టీ లో తెలుగు వారు చాలా మంది పాల్గొని అందరు ఉత్సహంగా ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. బాలయ్య బాబు పాట వచ్చినప్పుడు జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులు చిరు, లేదా పవన్‌ పాట వచ్చినప్పుడు చిరు-పవన్‌ అభిమానులు ఎంతో సంబరంగా ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. ఊహించని రీతిలో ..పార్టీ ఆర్గనైజ్‌ చేస్తున్న  వైస్సార్సీపీ పార్టీ కి చెందిన కార్యకర్త కార్యవర్గానికి చెప్పకుండా డిజె దగ్గరకు వెళ్లి ప్రముఖ సింగర్‌ మంగ్లీ పాడిన వైఎస్‌ఆర్‌సిపి పార్టీ పాటను పార్టీలో ప్లే చేయించాడు. దీంతో న్యూ ఇయర్‌ పార్టీలో రాజకీయ పార్టీ పాట పెడతారా  అని ..అటు బాలయ్య అభిమానులు ఇటు చిరు-పవన్‌  అభిమానులు గొడవ చేసార. గొడవ సరి చేయాల్సిన ఆర్గనైజర్లు...పోలీసులను  పిలిపించారు. దీంతో రాజకీయ పార్టీ పాట పెట్టినందుకు ఆర్గనైజర్లని ధీటుగా ఎదుర్కొన్న కేసి చేకూరి అనే బాలయ్య అభిమాని మీద కేసు పెట్టి స్టేషన్‌ కు తరలించారు. అంతటితో అయిపోయింది అనుకునేసరికి ...తరువాత రోజు ప్రముఖ మీడియా ఛానల్స్‌ ...అక్కడ జరిగిన సంఘటనని ...బాలయ్య మరియు చిరు-పవన్‌ అభిమానుల గొడవగా వైఎస్‌ఆర్‌సిపికి చెందిన మీడియా చిత్రీకరించిందని కొందరు చెబుతున్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :