Radha Spaces ASBL

అక్షయ్‌కుమార్ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ ట్రైలర్ రిలీజ్  !!!

అక్షయ్‌కుమార్ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ ట్రైలర్ రిలీజ్  !!!

బాలీవుడ్‌ యాక్టర్స్ అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’. ఈ మూవీకి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజు సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మానుషి ఛిల్లార్‌, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ మూవీని ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్‌ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ ను గమనిస్తే... స్టన్నింగ్ యాక్షన్‌ సీన్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఆర్మీ పాత్రలో ఫూల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఈ సినిమాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీని హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

ఈ సినిమాకు సుల్తాన్, టైగర్ జిందా హై వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. వశు భగ్నానీ, దీప్షికా దేశముఖ్, జాకీ భగ్నానీ నిర్మించారు. రంజాన్ ఈద్ కానుకగా ఈ చిత్రం.. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :