ASBL NSL Infratech

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలక్రిష్ణ సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు, చర్యలకు సిద్ధంగా ఉండాలని వారిని హెచ్చరించింది. అలాగే క్షమాపణలు తెలియజేస్తూ గత నెల పతంజలి సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్‌పై స్పందిస్తూ మీ క్షమాపణల పట్ల మేం సంతృప్తి చెందలేదు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్‌ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అయితే, అఫిడవిట్‌లో వీరు ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :