ASBL NSL Infratech

ఘనంగా ప్రారంభమైన ఆటా బాంక్వెట్‌ వేడుకలు

ఘనంగా ప్రారంభమైన ఆటా బాంక్వెట్‌ వేడుకలు

అమెరికాలో అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండు సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియా వరల్జ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో జూన్‌ 7న బాంక్వెట్‌ వేడుకలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఆటా అవార్డులను అందజేసింది. కమ్యూనిటీ సర్వీసెస్‌లో కృషి చేసినందుకుగాను టి. రామచంద్రారెడ్డికి అవార్డును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈ అవార్డును అందజేశారు. మెడిసిన్‌ రంగంలో చేసిన సేవకుగాను డాక్టర్‌ సతీష్‌కు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీరంగంలో డాక్టర్‌ మురళీధర్‌, లిటరేచర్‌కు సంబంధించి అంబికా అనంత్‌కు, హ్యుమనిటేరియన్‌ సర్వీసెస్‌కుగాను పవన్‌ యర్రంశెట్టి, ఇన్నోవేటివ్‌ బిజినెస్‌ లీడర్‌షిప్‌కుగాను శిల్పిరెడ్డికి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకిగాను డాక్టర్‌ సత్య కూనపులి, యూత్‌ ఆచీవ్‌మెంట్‌కుగాను అనన్య విట్టల్‌కు, ఆర్ట్స్‌లో శ్వేత తిరుపురమల్లు, యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభకుగాను హేమచంద్ర రంభ,  తదితరులకు అవార్డులను అందజేశారు. డోనర్లను కూడా ఘనంగా సత్కరించారు. మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినీనటుడు శ్రీకాంత్‌, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చివరన అనూప్‌ రూబెన్స్‌ సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. డోనర్లను కూడా సత్కరించారు. ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జయంత్‌ చల్లా, కన్వీనర్‌ కిరణ్‌ పాశం తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :