Radha Spaces ASBL

ఆటా 2024 కన్వెన్షన్: మినీ కన్వెన్షన్ ను తలపిస్తూ ఘనంగా సాగిన రాలీ కార్యక్రమాలు

ఆటా 2024 కన్వెన్షన్: మినీ కన్వెన్షన్ ను తలపిస్తూ ఘనంగా సాగిన రాలీ కార్యక్రమాలు

నార్త్ కెరొలినా రాష్ట్రం, రాలీ నగరంలో ఇటీవలి వారాంతం ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) కి ప్రతిష్టాత్మకంగా నిలిచింది. రాలీ చుట్టుపక్కల అనేక వివాహాలు, గృహప్రవేశాలు మరియు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ, 1500 మందికి పైగా ప్రజలు శుక్రవారం, మార్చి 15 నుండి ఆదివారం, మార్చి 17 వరకు నిర్వహించిన ఆటా బోర్డు మీటింగ్, వధూవరుల పరిచయ వేదిక, కిక్‌ ఆఫ్ మీటింగ్ మరియు హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ తరగతులు హాజరయ్యారు. మనందరికీ తెలుసు, జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటాలో 18వ ఆటా  కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ జరగబోతున్నాయని. అమెరికా అంతటా అనేక కన్వెన్షన్ కిక్‌ ఆఫ్ సమావేశాలు జరుగుతున్నాయి. రాలీ లో 3 రోజుల పాటు జరిగిన బహుళ కార్యక్రమాలు మినీ కన్వెన్షన్ ని తలపించాయి. మార్చి 15న ఎంబసీ సూట్స్‌ ఎట్ హిల్టన్ హోటల్‌లో వేరే ఊర్ల నుంచి వచ్చిన అతిథులకు  రాలీ ఆటా బృందం అందించిన సాదర స్వాగతంతో ఇదంతా ప్రారంభమైంది. వారి ప్రత్యేక ఆత్మీయ ఆహ్వానం పలువురిని ఆకట్టుకుంది.

మార్చి 16వ తేదీ ఉదయం 8 గంటల కల్లా  ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ బోర్డ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు,  గత నాయకత్వం మరియు పలువురు సభ్యులు సమావేశానికి సంసిద్ధంగా ఉండటం శ్లాఘనీయం. అల్పాహారం తర్వాత ఆటా బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఇక్కడ అనేక పోర్ట్‌ఫోలియోలలో పురోగతి మరియు అమెరికా, భారతదేశాలలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి వివరంగా చర్చించబడింది. ఆటా టీం మరియు సభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. కాంటినెంటల్ లంచ్ తర్వాత, అన్ని రాష్ట్రాల ప్రాంతీయ బృందాలు వారి ప్రస్తుత పనులు, వాటి దశ దిశ వివరించారు చివరగా, కాన్ఫరెన్స్ కమిటీలు8 తమ కార్యకలాపాల గురించి విశదీకరించారు . అనేక ఓపెన్ డోర్ చర్చలు కూడా జరిగాయి, అక్కడ చాలా మంది తమ పాత స్నేహితులను కలుసుకున్నారు మరియు కొత్త స్నేహాలను ఏర్పరచుకున్నారు. ఉదయం జరిగిన వధూవరుల పరిచయ వేదిక ద్వారా పలువురు కలుసుకోవడం, వివరాలు ఇచ్చి పుచ్చుకోవడం వంటి వాటి ద్వారా ఆటా వారికి ఎంతో సామాజిక బాధ్యత ఉందన్న విషయం అవగతమవుతుంది. విచ్చేసిన వారి  అంచనాలను మించి ఉండేలా కార్యక్రమాలు చేయడానికి రాలీ బృందం మొత్తం బహు కృషి చేసింది. వారి మర్యాదలను, ఏర్పాట్లను అందరూ మెచ్చుకున్నారు. ఈ బృందంలో ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, నేషనల్‌ కోఆర్డినేటర్‌ సాయి సుదిని, ఆర్‌ఏ పవన్‌ నోముల, ఆర్‌డీ హరీశ్‌ కుందూరు, మెంబర్‌షిప్‌ ఛైర్‌ రేవంత్‌ రెడ్డి, అమెరికా భారతి కో-ఛైర్‌ మురళీ నాగలూరి, ఆర్‌సీలు వీరేందర్‌ బొక్కా, కిరణ్‌ వెన్నెవెల్లి, స్టాండింగ్‌ కమిటీ అనిత యడవల్లి, శృతి చామల, రూప కర్కే, సరళ పేరూరి, నిహారిక నవల్గ, అజయ్ మద్ది, రమేష్ నల్లవుల, కమల్ పాములపాటి, ధీరజ్ మాదాడి, కిషోర్ పెంటి, సందీప్ రెడ్డి దగ్గుల, శివ గీరెడ్డి మరియు రాజు కూరపాటి ఉన్నారు.

సాయంత్రం కిక్ ఆఫ్ కార్యక్రమం రాయల్ బ్యాంక్వెట్ హాల్ లో ప్రార్థనా గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు మరియు నృత్యాలతో హోరెత్తింది. హాజరైనవారు కన్వెన్షన్ కోర్ టీమ్, గత, స్థానిక మరియు జాతీయ నాయకత్వం నుండి కన్వెన్షన్ యొక్క వివిధ వివరాలు తెలుసుకున్నారు. నిధుల సేకరణ పై అనుకున్న దానికంటే చాలా మంచి స్పందన వచ్చింది, హామీలు 300 వేలు మించడం శుభపరిణామం. సమావేశంలో  ముందుకు వచ్చి సహకరించిన స్పాన్సర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటివి భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను మరింత చేరువ చేయడానికి దోహద పడతాయి. కన్వెన్షన్ కోర్ కమిటీ కన్వీనర్ కిరణ్ పాశం, ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుదిని, కో-కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో-ఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో-డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ లు అందరితో కలియతిరిగి, ముచ్చటించి వివరాలు అందించారు. అనేక మంది ప్రేరణ పొంది, తామంతా కన్వెన్షన్‌లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మార్చి 17న యు ఎన్ సి కాలేజీ క్యాంపస్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ తరగతులలో చాలామంది పాల్గొని,  ప్రయోజనం పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులలో ఒకరైన హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం గురువులు దాజీ ఆటా కన్వెన్షన్‌కు హాజరవుతున్నారని పేర్కొనడానికి సంతోషిస్తున్నాము.

మూడు రోజులూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం మరియు పానీయాలు అందించబడ్డాయి. కార్యక్రమంలో పాల్గొన్న దాతలు, నాయకులు, స్వచ్ఛంద సేవకులు, పుర ప్రజలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. వైభవ్ గరిమెళ్ల, సహస్ర కూరపాటి ప్రార్థన పాటలు, ఆటా ట్యూటరింగ్ ప్రోగ్రామ్‌లో వరుణ్ కుందూర్, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నవారు, జీవన్, శ్రీధర్, సందీప్, మురళీ నాగలూరి మరియు కళ్యాణ్ లకు ఆడియో, వీడియో, ఫోటోగ్రఫీ, డెకరేషన్ మరియు రుచికరమైన ఆహారాన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని సమావేశాలు రాబోతున్నాయి, రకరకాల పోటీలు, క్రీడలు మరియు ఆటల కోసం అనేక రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికే నడుస్తున్నాయి. మరిన్ని వివరముల కోసం, www.ataconference.org ని సందర్శించండి లేదా ఫేస్ బుక్ లేక ఇంస్టాగ్రామ్ లో మమ్మల్ని అనుసరించండి. మేము చుట్టూ జరిగే అన్ని సంఘటనలు ఉత్సాహంతో అప్‌డేట్ చేస్తూనే ఉంటాము, వేచి చూడండి.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :