ASBL Koncept Ambience
facebook whatsapp X

నాగ్ అశ్విన్ గురించి అశ్వినీద‌త్ ఏమంటున్నాడంటే..

నాగ్ అశ్విన్ గురించి అశ్వినీద‌త్ ఏమంటున్నాడంటే..

ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్ లో తెర‌కెక్కిన క‌ల్కి 2898ఏడీని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ బ‌య‌ట చాలా సింపుల్ గా క‌నిపిస్తాడ‌నే విష‌యం తెలిసిందే. బ‌య‌టే కాదు సినిమా సెట్స్ లో అయినా, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో అయినా నాగి సింపుల్ గానే ఉండ‌టాడు. క‌ల్కి తీసిన‌న్ని రోజులు నాగ్ అశ్విన్ ఒకే స్లిప్ప‌ర్స్ ధ‌రించ‌డం విశేషం.

సినిమా రిలీజైన‌ప్పుడు ఆ చెప్పులు పాడైపోయిన స్థితిని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. నాగ్ అశ్విన్ మామ‌, క‌ల్కి నిర్మాత అయిన అశ్వినీద‌త్ రీసెంట్ గా వైజ‌యంతీ మూవీస్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. అందులో నాగి సింప్లిసిటీ గురించి అశ్వినీద‌త్ మాట్లాడాడు.

బ‌య‌ట అంద‌రి దృష్టిలో నాగ్ అశ్విన్ ఎంతో గొప్ప వ్య‌క్తి కానీ త‌ను చాలా సింపుల్ గా ఉంటాడు. అత‌ని గురించి ఎవ‌రికీ తెలియ‌ని కొన్ని విష‌యాలున్నాయ‌ని వాటి గురించి చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. నాగి త‌న ఇంటికి హ‌డావిడిగా వ‌స్తాడ‌ని, వ‌స్తూనే స్లిప్ప‌ర్స్ బ‌య‌ట విడిచి లోప‌లికి వ‌స్తాడ‌ని, వెళ్లేట‌ప్పుడు త‌న చెప్పులేసుకుని వెళ్తాడ‌ని చెప్పాడు. అయితే ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యం ఏంటంటే నాగి వ‌చ్చేట‌ప్పుడు వేసుకొచ్చిన చెప్పులు కూడా నాగి వాళ్ల నాన్న గారివ‌ట‌. ఇలా నాగి గురించి ద‌త్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :