ASBL NSL Infratech

 బే ఏరియాలో ఘనంగా నారీ వేడుకలు

 బే ఏరియాలో ఘనంగా నారీ వేడుకలు

కాలిఫోర్నియాలోని శాన్‌ హోసెలో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), ఇండియన్‌ కాన్సులేట్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో ఆధ్వర్యంలో ‘‘నారీ’’ (మహిళా దినోత్సవ కార్యక్రమం) వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. నారీ శక్తిని, సమాజానికి సేవ చేస్తున్న మహిళా సేవలను అందరికీ తెలిసేలా చేయడానికి వీలుగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో ఇండియన్‌ కాన్సులేట్‌ తరపున ప్రతిమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అసెంబ్లీ సభ్యుడు గెయిల్‌ పెల్లెరిన్‌, శాంటా క్లారా కౌంటీ సూపర్‌వైజర్‌ సుసాన్‌ ఎలెన్‌బర్గ్‌, డా. అంజలి గులాటి, ఆపి ప్రెసిడెంట్‌ బే ఏరియా, కృతికా భట్‌, సిఐఎ ప్యూర్‌ స్టోరేజ్‌ తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకలకు దాదాపు 300 మందికిపైగా కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు. కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, శాన్‌ ఫ్రాన్సిస్కో సహకారంతో నిర్వహించిన ఈ వేడుకకోసం వేదికను చక్కగా అలంకరించారు. కార్యక్రమాలు కూడా చూడముచ్చటగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన 38 మంది మహిళా నాయకులను ఘనంగా సత్కరించారు. ప్యానెల్‌ వక్తలు మరియు ముఖ్య అతిథి వారి ప్రయాణం మరియు సవాళ్ల గురించి స్ఫూర్తిదాయకమైన మరియు సమాచార సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారిణులు ప్రదర్శించిన  సృజనాత్మక నృత్యాలు అతిథులను మంత్రముగ్ధులను చేశాయి.

కాంగ్రెస్‌ మహిళ జో లోఫ్‌గ్రెన్‌, కాంగ్రెస్‌ మహిళ అన్నా ఇషూ, అసెంబ్లీ సభ్యుడు గెయిల్‌ పెల్లెరిన్‌ మరియు ఫ్రీమాంట్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యుడు తెరెసా కాక్స్‌ కార్యాలయాల ప్రతినిధులు, ఎఐఎ, కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రశంసా పత్రాలను అందించారు. టాలీవుడ్‌ గాయని ఐశ్వర్య రవిచంద్రన్‌, తాన్య గుప్తా లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ అందరినీ ఆకట్టుకుంది. రాణి సుని స్టూడెంట్స్‌ ప్రదర్శించిన సెమీ క్లాసికల్‌ డ్యాన్స్‌, బాలీవుడ్‌ రీమిక్స్‌తో రీతు సి డ్యాన్స్‌ కంపెనీ, యూత్‌ టీమ్‌ ఫ్యాషన్‌ షో తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పసందైన వంటకాలను వచ్చినవారికి వడ్డించారు.  

ఆర్గనైజింగ్‌ టీమ్‌ సభ్యులు విజయ, కుకు, దీప, గాయత్రి, జయ, శ్రీలు, శిరీష, జాస్మిన్‌, ఇందు, యామిని, అనూజలు కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు. ఈవెంట్‌ను విజయవంత్‌ చేయడానికి సహకరించిన వలంటీర్లు, దాతలు, అతిధులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. 

రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్య ఈ కార్యక్రమ సమర్పకునిగా వ్యవహరించారు. ప్రీతి మునగపాటి (సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫీల్డ్‌ చైర్మన్‌) కూడా దాతగా ఉన్నారు.
 

 

Click here for Event Gallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :