మమత బెనర్జీతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. కోల్‌కతాలో దీదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢల్లీిలో అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకుండా సీఎం కేజ్రీవాల్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా తిరుగనున్నారు. ఇందులో భాంగంగానే దీదీని కలిసి కేజ్రీవాల్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పలువురు పార్టీ నేతలు భేటీలో పాల్గొన్నారు.







Tags :