Radha Spaces ASBL

సీబీఐకి చుక్కలు చూపిస్తున్న అవినాశ్ రెడ్డి..!!

సీబీఐకి చుక్కలు చూపిస్తున్న అవినాశ్ రెడ్డి..!!

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వచ్చే నెలాఖరులోపు పూర్తి చేయాల్సిన బాధ్యత సీబీఐ పైన ఉంది. నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకూ ఈ కేసు కొలిక్కి రాలేదు. దీంతో సీబీఐపై అనేక విమర్శలు వచ్చాయి. బాధితుని కుటుంబం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కేసు విచారణకు గడువు విధించింది. దీంతో సీబీఐ అప్రమత్తమైంది. కోర్టు సూచన మేరకు విచారణాధికారిని కూడా మార్చింది. దూకుడు పెంచింది అనుకునే లోపు సీబీఐకి అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వై.ఎస్.అవినాశ్ రెడ్డి.. సీబీఐకి ముప్పతిప్పలు పెడుతున్నారు.

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పుడు కేసంతా అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతోంది. అవినాశ్ ఫ్యామిలీ పాత్ర ఉందని సీబీఐ గట్టిగా నమ్ముతోంది. ఎందుకంటే హత్య చేసిన వాళ్లంతా హత్యకు ముందు, వెనుక అవినాశ్ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నారు. కొంతమంద అవినాశ్ కుటుంబీకులతోనే కలిసి ఉన్నారు. పైగా అవినాశ్ కుటంబ ఆదేశాలమేరకే తాము హత్య చేశామని ఇప్పటికే నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని నిర్ధారించుకునేందుకు ఇప్పటికే అవినాశ్ తో పాటు తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు కూడా చేసింది.

ఇక మిగిలింది అవినాశ్ రెడ్డే అని అందరూ భావిస్తున్నారు. ఈసారి విచారణకు వెళ్తే అవినాశ్ ను కూడా సీబీఐ అరెస్టు చేయడం ఖాయమని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అందుకే విచారణకు వెళ్లకుండా అవినాశ్ తప్పించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి శుక్రవారం విచారణకు మొత్తం సిద్ధమైంది. అయితే అవినాశ్ చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం బాగలేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో సీబీఐ కూడా అసహనానికి గురైంది. ఇలా అవినాశ్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం అవినాశ్ కు కొత్తకాదు. జనవరి నుంచి ఇప్పటివరకూ నాలుగు సార్లు అవినాశ్ రెడ్డి ఇలాగే డుమ్మా కొట్టారు.

తాము అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తున్న ప్రతిసారి ఏదో ఒక వంకతో అవినాశ్ రెడ్డి తప్పించుకుంటున్నారు. కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉంటేనే విచారణకు హాజరవుతున్నారు. లేకుంటే ఇలా తప్పించుకుంటున్నారు. దీంతో సీబీఐ తీవ్ర అసహనంతో ఉంది. ఈసారి అవినాశ్ ఖాయమనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. మళ్లీ సోమవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈసారైనా అవినాశ్ విచారణకు హాజరవుతారా.. లేకుంటే మరో సాకుతో తప్పించుకుంటారా.. అనే అనుమానం ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :