Radha Spaces ASBL

కమల వికాసమెలా?

కమల వికాసమెలా?

తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూస్తే రెండడుగులు ముందుకు.. నాలుగు వెనక్కు అన్నట్లు తయారైంది. ఎదురుగా యుద్ధక్షేత్రం కనిపిస్తోంది. బరిలో ప్రత్యర్థులతో పోరాడాల్సిన కమలం  పార్టీ నేతలు.. అంతర్గత పోరాటానికే అధిక సమయం వెచ్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ రెండురోజులకోసారి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారని వార్తలు రావడం, దాన్ని ఎవరో ఓనేత ఖండించడం సాదారణమైంది. ఎన్నికల రణరంగంలో ముందుండి నడిపించాల్సిన నేత పదవికే గ్యారంటీ లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిేంది. ఇక్కడ వీలైనంతగా చేరికలను ప్రోత్సహించాలని.. దీనికోసం ఈటల నేతృత్వంలో ఓకమిటీ కూడా పనిచేస్తోంది. కానీ ఏం లాభం.. ఎవరూ వచ్చి చేరుతామనడం లేదు. కర్నాటక ఫలితాల సరళి తర్వాత బీజేపీలో చేరికల సంఖ్య బాగా తగ్గింది. ఓవైపు అధిష్టానం చేరికల్ని ప్రోత్సహించమని చెబుతుంటే .. వచ్చి కలిసే నేతలు మా సంగతేంటి అంటున్నారు. దీంతో వారికి టికెట్ హామీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రనేతలు.. ఇంక పార్టీలో చేరికల్ని ఎలా సజావుగా నిర్వహించగలుగుతారు..

ఇటీవలి కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో చేరికల మంత్రాన్నే బీజేపీ అనుసరిస్తోంది. అలా చేసే చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో అయితే ప్రతిపక్ష స్థానాన్ని సొంతం చేసుకుంది. కానీ ఈ మంత్రం.. తెలంగాణలో పనిచేయడం లేదు. ఇక్కడ నేతలకు డబ్బుకు కొదవ లేదు. కావాల్సినంత రాజకీయ అనుభవం ఉంది. దీంతో పక్కాగా తేలిస్తే కానీ.. కమలం తీర్థం పుచ్చుకోనంటున్నారు. దీనికి తోడు బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్... ఆపార్టీలో చేరిన నేతలను ఇబ్బంది పెడుతున్నాయని సమాచారం. ఫలితంగా గతంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న వివిధ  పార్టీల నేతలు సైతం.. తిరిగి సొంతగూటి వైపు చూస్తున్నారు.

పరిస్థితి ఎంతలా వచ్చిందంటే  బీజేపీలో చేరతారని ప్రచారం జరిగిన జూపల్లి, పొంగులేటి లాంటి లీడర్లు సైతం .. కర్నాటక ఫలితాల  తర్వాత సందిగ్ధంలో ఫడినట్లు సమాచారం. గ్రౌండ్ లెవల్లో సరైన కేడర్ లేదు.. ఉన్న లీడర్లు సైతం.. వారి నియోజకవర్గంలో గెలిస్తే అంతే చాలు అన్నట్లు ఉన్న పరిస్థితి. దీంతో కేడర్ లేకుండా , లీడర్లు జాయిన్ కాకుండా పార్టీ .. తెలంగాణ ఎన్నికల్లో ఎలా అధికస్థానాలను దక్కించుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చివరగా హైదరాబాద్ లో బీజేపీ అంటే గుర్తొచ్చే ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటును ఉపసంహరించని పరిస్థితి ఉంది. ఓదశలో రాజాసింగ్ సైతం పక్క చూపులు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాను ఎందులోనూ చేరడం లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. హిందూత్వ అజెండాతో ముందుకెళ్తున్న బండిసంజయ్ సైతం.. రాజాసింగ్ వ్యవహారంలో ఏం చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బండి సారథ్యంలోని బీజేపీ... జోరుమీదున్న కారును ఢీకొట్టగలదా అన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకూ వినిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :